ATP: వివిధ శాఖల పరిధిలో కేటాయించిన లక్ష్యాలను సత్వరమే పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్ఓ మాలోలతో కలిసి పిజిఆర్ఎస్, జనగణన, ఉపాధి హామీ, ఇళ్ల నిర్మాణం, పాఠశాలల్లో ప్రవేశాల వంటి పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.