BHPL: రేగొండ మండలం రేపాకపల్లిలో రైతు దంపతుల మృతిపై వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. చంద్రమౌళి, భాగ్యలక్ష్మి దంపతులు తమ పొలంలో వరి అవశేషాలు కాల్చుతుండగా తీవ్ర ఎండలతో డీహైడ్రేషన్‌కు గురయ్యారు. చంద్రమౌళి మంటల్లో చిక్కుకుని మృతి చెందగా, భర్త మృతిని చూసిన భార్య అపస్మారక స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. భాగ్యలక్ష్మికి రైతు భీమా వర్తిస్తుందన్నారు.