WNP: డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరింత ఆర్థిక భారం మోపుతుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శివసేన రెడ్డి అన్నారు. రేపు జిల్లాలో ధరల పెంపుపై ఎద్దుల బండ్లతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యఅతిథిగా చిన్నారెడ్డి, మెగా రెడ్డి హాజరుకానున్నారు. ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.