TPT: సత్యవేడు వైదేహి కళ్యాణమండపంలో జీకేఎంఐ ఆధ్వర్యంలో జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో విజేతలకు రూ.75 వేల నగదు బహుమతులు అందజేశారు. బాలికల టీంకట్ట విజేతలకు బీజేపీ మండల అధ్యక్షుడు బాలాజీ రూ.4 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందించారు.