MDCL: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపురం కాలనీలో సోమవారం ‘మీ సురక్ష’ కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్వాల్ సిఐ ప్రశాంత్ మాట్లాడుతూ.. కాలనీల్లో భద్రత, నేరాల నివారణకు అద్దెదారులు, ఇంటి పనివారు, డ్రైవర్లు, వాచ్మెన్ల వివరాల ధృవీకరణ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులకు అవగాహన కల్పించగా సెక్టార్ ఎస్సై పాల్గొన్నారు.