KMM: జిల్లాలో సోమవారం ఎండలు భగ్గుమన్నాయి. వైరా, ఎన్కూరు, ఖమ్మం అర్బన్‌లలో అత్యధికంగా 46.3°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. మధిర, కొణిజర్ల, ముదిగొండలలో 46.2°Cగా రికార్డయ్యింది. జిల్లాలోని అత్యధిక మండలాల్లో ఉష్ణోగ్రతలు 45°C దాటడంతో అధికారులు ‘రెడ్ వార్నింగ్’ (తీవ్ర హెచ్చరిక) జారీ చేశారు.