కర్ణాటక మాజీ రంజీ ప్లేయర్ ఎస్.ఎల్ అక్షయ్ (39) మైదానంలోనే గుండెపోటుతో కన్నుమూశాడు. బెంగళూరులో జరిగిన ఒక స్థానిక టీ20 మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా అతడు ఒక్కసారిగా ఛాతి నొప్పితో కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అక్షయ్ మరణవార్తను భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ సామాజిక మాధ్యమాల వేదికగా ధృవీకరిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.