NTR: జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మిశ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. అనంతరం ప్రథమ చికిత్స కేంద్రాన్ని పరిశీలించి వేసవి నేపథ్యంలో భక్తులకు మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. రిజిస్టర్ పరిశీలించి ఏర్పాట్లు సమీక్షించారు.