ATP: గుంతకల్లు మండలం ఎన్.కొట్టాల గ్రామంలో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామంలో నీటి సరఫరా బంద్ అయింది. గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చవేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.