అన్నమయ్య: కూటమి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచుతూ.. సామాన్యుడి నడ్డి విరుస్తోందని YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పది రోజుల్లోనే నాలుగు సార్లు ఇంధన ధరలను పెంచి, పెట్రోల్‌పై రూ. 7. 79, డీజిల్‌పై రూ. 7. 81 భారం మోపారని మండిపడ్డారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలోనే ఇంధన ధరలు ఉన్నాయని విమర్శించారు.