GNTR: కారుణ్య నియామకాలు క్రింద ఏడుగురు అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ సీ.యం.సాయి కాంత్ వర్మ నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. వివిధ శాఖలలో వారికి నియామకాలు చేస్తూ ఈ మేరకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి పాల్గొన్నారు.