SS: లేపాక్షి మండలంలో రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని అలాగే మే 30 వరకు గడువు పొడిగించినట్లు తహసీల్దార్ సౌజన్య తెలిపారు. మండలంలోని 14,700 రేషన్ కార్డుల్లో ఇప్పటివరకు 41,439 మంది ఈ కేవైసీ చేయించుకోగా, ఇంకా 2,287 మంది పెండింగ్లో ఉన్నారు. ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ బియ్యం, ఇతర ప్రభుత్వ పథకాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.