భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకుంది. రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించింది. 48 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ..భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్ అందించి చరిత్ర సృష్టించినందుకు గాను ప్రభుత్వం ఆమెను ఈ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది.