VSP: పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీఐటీయూ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి.వామనమూర్తి డిమాండ్ చేశారు. ఈ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సోమవారం విశాఖలోని అక్కయ్యపాలెం నరసింహనగర్ రోడ్డులో ఆటో డ్రైవర్లతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 రోజుల్లోనే లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.7 పెంచారన్నారు.