MLG: జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్, పార్కింగ్, భద్రత, వైద్య సదుపాయాలు ముందుగానే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.