MDCL: అల్వాల్‌లోని మూడు చెరువుల్లో గుర్రపు డెక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రతి చెరువుకు పనివారితో పాటు పడవను ఏర్పాటు చేసి గుర్రపు డెక్కను ఎప్పటికప్పుడు తొలగించాలని అల్వాల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరులకు వినతి పత్రం అందజేశారు. ఇలా చేయడం వల్ల దోమల బెడద తగ్గడంతో పాటు పదే పదే అయ్యే ఖర్చు కూడా తగ్గుతుందన్నారు.