SRPT: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, అరవపల్లి పిహెచ్సీలను ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జేడీ డా.జయలక్ష్మి సోమవారం తనిఖీ చేశారు. డీఎంహెచ్వో డా.వెంకటరమణతో కలిసి హెచ్ఐవీ కిట్ల సరఫరాపై సమీక్షించారు. ఎండల తీవ్రత దృష్ట్యా రోగులకు ముందే మందులు అందించాలని, పరీక్షలు వేగవంతం చేసి ఎల్ఎఫ్యూ కేసులను తగ్గించాలని అధికారులను ఆదేశించారు.