AP: రాష్ట్రంలో మరో 2,3 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రేపు 26 మండలాల్లో తీవ్ర వడగాలులు, 137 మండలాల్లో వడగాలులు వీస్తాయని.. ఎల్లుండి 70 మండలాల్లో తీవ్ర వడగాలులు, 176 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. SKLM, VSP, AKP, కృష్ణా, మన్యం, ప.గో జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.