MBNR: జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన కృష్ణారెడ్డి, మధు కుమార్, శ్రీశైలం గౌడ్, శివకుమార్, బీర్ల చెన్నయ్యలు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ అబ్జర్వర్ ప్రవీణ్ ముదిరాజ్, ఇంఛార్జి ఎల్లయ్య యాదవ్‌లు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.