పార్వతీపురం మండలం చినమరికిలో అంగరంగ వైభవంగా గ్రామదేవతల వారాలు పండగ జరిగింది. యువత ఘటాలు మోసుకుని అగ్ని నిప్పులు మట్టుకుంటూ పోతురాజు పోలమ్మ గుడి వద్దకు చేరుకుని పూజలు చేశారు. అనంతరం పోతురాజు పోలమ్మ గుడి నుంచి గ్రామ చివర దేశతల్లి గుడివరకు గ్రామమంతా చేరుకొని పసుపు కుంకుమ పాల జంగిడిని మోసుకుంటూ ప్రధాన రహదారిపై ఊరేగింపు నిర్వహించారు.