E.G: రాజమండ్రి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వానిధి పథకంపై అవగాహన, సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా పీడీ టి. కనక రాజు మాట్లాడుతూ.. పీఎం స్వానిధి పథకం కింద గత సంవత్సరాల వరకు పట్టణ ప్రాంతాలలో గుర్తించిన వీధి వ్యాపారస్తులకు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.