NLR: వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లె వద్ద సుమారు 100 ఎకరాల్లో ఏర్పాటు కానున్న MSME పార్కుకు CM చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. MLA ఇంటూరి నాగేశ్వరరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలి దశలో 20 ఎకరాల్లో 9 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్క్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని MLA పేర్కొన్నారు.