NDL: ఆళ్లగడ్డలో అనారోగ్యంతో వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు CMRF కింద రూ.38,16,958 విలువైన చెక్కులను సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పంపిణీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు CMRF కొండంత అండగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.