NTR: విజయవాడ- ఏలూరు రోడ్డులో సోమవారం ప్రమాదం జరిగింది. రామవరప్పాడు నుంచి మాచవరం వైపు ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు వెళ్తుండగా, బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ వెంకటరమణ వెంటనే ఆసుపత్రికి తరలించారు.