CTR: చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో 48 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. భూ తగాదాలు, కుటుంబ వివాదాలు, డబ్బు, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై ప్రజలు ఫిర్యాదులు అందజేశారు.