GDWL: ప్రజావాణిలో అందిన 99 అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన బాధితుల నుండి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.