NDL: నంది కొట్కూరు పట్టణంలో 2 నెలలుగా నిర్వాసితులు జీవో.98 ఉద్యోగాల కోసం దీక్షలు చేస్తున్నా, గద్దె నెక్కిన నాయకులు కన్నెత్తి చూడకపోవడం దారుణమని, వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులు నేడు 61వ రోజు దీక్షలు చేపట్టారు. స్థానిక ప్రజా ప్రతినిధులు జీవో.98 సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నిర్వాసితులకు బాసటగా నిలిచి, దీక్షలు విరమింప చేయాలని కోరారు.