ADB: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని అర్జిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత పోలీస్ సిబ్బందితో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.