NRML: ధాన్యం తరలింపు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఖానాపూర్ ఏఎంసీ ఛైర్మన్ పడిగల భూషణ్ సూచించారు. లక్ష్మణ్ చందా మండలంలోని రాజరాజేశ్వర రైస్ మిల్లు గోదామును మొక్కజొన్న ధాన్యం నిల్వ కొరకు వారు సందర్శించారు. మొక్కజొన్న తరలింపు విషయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ ఛైర్మన్ రమేష్ రావు, సీవో ఆశన్న ఉన్నారు.