KNR: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో హోటల్ మేనేజ్మెంట్ 2వ సెమిస్టర్ పరీక్ష (అకామడేషన్ ఆపరేషన్స్ – II) వాయిదా అయింది. ఈనెల 28న జరగాల్సిన పరీక్షలు బక్రీద్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా.డి.సురేశ్ కుమార్ తెలిపారు. ఇంతకుముందు ప్రకటించిన సమయాల ప్రకారమే, ఎటువంటి మార్పు లేకుండా అదే పరీక్షను ఆయా కేంద్రాల్లో జూన్ 5న నిర్వహిస్తామని వెల్లడించారు.