JGL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పలు ఫిర్యాదులను పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై పారదర్శకంగా విచారణ జరిపి త్వరితగతిన న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.