ATP: అనంతపురంలో మెప్మా ఆధ్వర్యంలో 15 మందికి ఈ-సైకిళ్లను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పంపిణీ చేశారు. కాలుష్య నివారణ, ఇంధన పొదుపు కోసం ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. రూ.35 వేల విలువైన సైకిళ్లపై ప్రభుత్వం రూ.12 వేల సబ్సిడీని కల్పిస్తోందని వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే ఈ సైకిళ్లు గంటకు 40 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయని తెలిపారు.