WGL: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 103 వినతులు నమోదయ్యాయి. నగర ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అదనపు కమిషనర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. నమోదైన ఫిర్యాదుల్లో టౌన్ ప్లానింగ్ 48, ఇంజినీరింగ్ 32, రెవిన్యూ 9, హెల్త్ అండ్ శానిటేషన్ 10, నీటి సరఫరాకు సంబంధించిన 4 ఫిర్యాదులు ఉన్నాయి.