భద్రాచలం గిరిజన ఉపాధ్యాయ డి.ఎడ్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఏజెన్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సర్టిఫికెట్లు ఆలస్యంగా అందుతున్న విద్యార్థుల సౌకర్యార్థమే గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు.