KNR: వ్యవసాయ భూముల్లో పంట కోత అనంతరం మిగిలిన గడ్డి, పంట అవశేషాలను రైతులు కాల్చడం నివారించాలని చొప్పదండి ఎస్ఐ నరేష్ రెడ్డి తెలిపారు. గడ్డి కాల్చడం మూలంగా అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. పర్యవేక్షణ కాలుష్యంతో పాటు భూమి సారవంతం దెబ్బ తింటుందన్నారు. కాల్చకుండా భూమిలోనే దున్నితే సేంద్రియ ఎరువుగా ఉపయోగ పడుతుందని సూచించారు.