IPL చరిత్రలో అత్యధిక డకౌట్ల రికార్డుతో రోహిత్ శర్మ, మాక్స్వెల్ 19 సార్లు అగ్రస్థానంలో ఉన్నారు. దినేష్ కార్తీక్, సునీల్ నరైన్ 18తో తర్వాతి స్థానాల్లో నిలిచారు. తర్వాత స్థానంలో చావ్లా, రషీద్ 16 ఉండగా..మన్దీప్, రహానే 15, రాయుడు, మనీష్ 14, హర్భజన్, పార్థివ్ 13 చొప్పున డకౌటయ్యారు. కోహ్లీ, అశ్విన్, గంభీర్, శాంసన్, సూర్యకుమార్ చెరో 12 సార్లు సున్నాకే వెనుతిరిగారు.