TG: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని కొందరు ఆటో డ్రైవర్లను, కార్మికులను రెచ్చగొట్టి అడ్డుపడే ప్రయత్నం చేశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఆస్తుల కోసం సొంత చెల్లిని ఇళ్లనుంచి వెళ్లగొట్టే రకాలు కొందరు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా మహిళా సంక్షేమ పథకాలు ఆపేది లేదని, మహిళా శక్తి సంఘాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.