PDPL: సుల్తానాబాద్ సింగిల్ విండోలో రైతులకు 50 శాతం రాయితీపై జీలుగు జానుము విత్తనాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేంద్రియ ఎరువుల వినియోగంతో భూసారం పెరిగి రైతులకు అధిక లాభాలు వస్తాయని తెలిపారు. రైతులు వరి కొయ్యలను కాల్చవద్దని, అలా చేస్తే భూసారం తగ్గడంతో పాటు అగ్నిప్రమాదాల ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.