భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో వెలుగు మహిళా స్వయం సహకార సంఘాల మీటింగ్ నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ గండ్ర హరీష్ రెడ్డి, 17వ వార్డు మాజీ కౌన్సిలర్ ముంజంపల్లి మురళీధర్ హాజరై మాట్లాడుతూ… మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు.