AKP: ముఖ ఆధారిత హాజరు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఎస్. రాయవరం మండలం పెద ఉప్పలం సచివాలయం వద్ద వేతనదారులు ఆందోళన నిర్వహించారు. ఏడాదిలో 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. వేతనదారులకు రోజువారి వేతనం రూ.700కు పెంచాలన్నారు. అదనంగా వేసవి అలవెన్స్ ఇవ్వాలన్నారు.