KDP: నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అదనపు కార్మికులకు రూ.15,500 వేతనం అమలు చేయాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై సోమవారం కరపత్రం విడుదల చేశారు. ఏడేళ్లుగా PF లేకుండా,వేతనాలు పెంచకుండా అధికారులు మాయమాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ తీర్మానాన్ని అమలు చేయాలని, లేదంటే జూన్ 1న కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.