TG: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీతారామ ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ప్రస్తుతం తాము ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేశామని, కీలకమైన జూలూరుపాడు టన్నెల్ పనులను ఏడాది కాలంలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రైతాంగానికి సాగునీరు అందించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు.