కోనసీమ: జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్షరాంధ్ర రెండో దశ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నికోడియా దేవి అధికారులకు పిలుపునిచ్చారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్ నందు అక్షరాంధ్ర రెండో దశ కార్యక్రమం సన్నద్ధతపై జేసీ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు.