ప్రకాశం: సీయస్పురం మండలంలోని ప్రముఖ పర్యాటక శైవక్షేత్రం భైరవకోనలో సోమవారం కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలపాతాన్ని సందర్శించిన అనంతరం త్రిముఖ దుర్గాదేవి, భర్గేశ్వర స్వామి, నాగరేశ్వర స్వామి, కాలభైరవేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.