MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో స్ట్రార్మ్ వాటర్ డ్రైనేజీ పనుల నేపథ్యంలో రేపటి నుంచి అంబేడ్కర్ చౌరస్తా నుంచి పాత బజార్ మార్గాన్ని 10 రోజుల పాటు మూసివేస్తున్నట్లు కాంట్రాక్టర్ తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా గోడ ఫంక్షన్ హాల్ వద్ద రాకపోకలు నిలిపివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని, వరద నివారణ కోసం సహకరించాలని అధికారులు కోరారు.