KMM: అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న ఓ NRIని ఖమ్మం పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని సుధాచంద్రికకు ఏపీలోని ఒంగోలుకు చెందిన వెంకట నవీన్ సాయి చందుతో 2022లో వివాహమైంది. పెళ్లయిన నాటి నుంచి భార్యను నల్లగా ఉన్నావని, అదనపు కట్నం తేవాలని శారీరకంగా బాధించే వాడు. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు.