SS: మడకశిర నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. అగలి మండలానికి చెందిన పలువురు కీలక నాయకులు, ప్రజాప్రతినిధులు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పట్టణంలోని బాలాజీ నగర్ టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సమక్షంలో దాదాపు 40 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు.