ADB: నేరడిగొండ మండల కేంద్రంలో శబరిమాత 3వ ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.