నంద్యాల జిల్లాలో చుక్కల భూములు, 22ఏ నిషేధిత జాబితాకు సంబంధించిన సమస్యలను పారదర్శకంగా, చట్టబద్ధంగా, వేగవంతంగా పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ జీ. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో 16 మందికి ల్యాండ్ ప్రొసీడింగ్స్ పత్రాలను కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ పంపిణీ చేశారు.