TG: యాదాద్రి-వరంగల్ జాతీయ రహదారి(NH-163) భూసేకరణ కేసులో రైతులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. పరిహారం పెంపుపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ NHAI పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. దీంతో పెంచిన డబ్బులను విత్డ్రా చేసుకునేందుకు రైతులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ తీర్పుతో బాధితులకు రూ.2.81 కోట్ల అదనపు వడ్డీ కూడా లభించనుంది.